- నామినేషన్ల పర్వానికి శ్రీకారం..
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలో మిగిలిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. తొలిరోజే నాలుగు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కలిపి మేయర్, ఛైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్ పదవులకు మొత్తం 273 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధానంగా కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. నాలుగు కార్పొరేషన్లలోని నాలుగు మేయర్ పదవులకు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. శ్రీకాకుళంలో నాలుగు, మంగళగిరి-తాడేపల్లిలో ఒక నామినేషన్ నమోదైంది. పార్టీల వారీగా బిజెపి, టిడిపి, వైసిపి, జనసేన నుంచి ఒక్కొక్కరు, ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు.
260 కార్పొరేటర్ స్థానాలకు గాను 98 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో బిజెపి 2, టిడిపి 35, వైసిపి 30, జనసేన 8, స్వతంత్ర అభ్యర్థులుగా 23 మంది నామినేషన్లు సమర్పించారు.మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 19 ఛైర్మన్ పదవులకు పది నామినేషన్లు వచ్చాయి. బిఎస్ పి ఒకటి, బిజెపి ఒకటి, సిపిఎం ఒకటి, కాంగ్రెస్ నాలుగు, వైసిపి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి.749 కౌన్సిలర్ స్థానాలకు 160 నామినేషన్లు నమోదయ్యాయి. బిఎస్ పి ఒకటి, బిజెపి నాలుగు, సిపిఎం నాలుగు, కాంగ్రెస్ ఎనిమిది, టిడిపి 31, వైసిపి 97, జనసేన తొమ్మిది, ఇతర పార్టీల నుంచి ఒకటి, స్వతంత్ర అభ్యర్థులుగా ఐదుగురు నామినేషన్లు వేశారు. ఈ నెల 16వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. దీంతో రానున్న రోజుల్లో నామినేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.








కామెంట్‌లు (0)