గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జెన్ జీ యువత ఓటింగ్ ‌లో చురుగ్గా పాల్గొనాలి : రాజ్యసభ ఎంపి సానా సతీష్ బాబు

19 నిమిషాల క్రితం

Gen Z youth should actively participate in voting Rajya Sabha MP Sana Satish Babu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 03:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా, స్టేడియం రోడ్డులోని హౌసింగ్ బోర్డు కార్యాలయ భవనంలో ఏర్పాటు చేసిన 66/2 పోలింగ్ బూత్‌లో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పండుగలో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. “మన ఓటు.. మన భవిష్యత్తు.. ఓటు వేయడం మన బాధ్యత” అని పేర్కొన్నారు.రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతుండటం సంతోషకరమని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో కాకినాడలో ప్రశాంత వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విధిగా వినియోగించుకోవడమే ప్రజాస్వామ్య విజయానికి తొలి మెట్టని ఎంపీ అన్నారు. ముఖ్యంగా జెన్ జీ యువత ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి చూపుతూ పోలింగ్‌లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.యువత, మహిళలు, వృద్ధులు సహా అర్హులైన ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని ఎంపీ సానా సతీష్ బాబు కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్