శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని 1 నుంచి ‘చలో ఢిల్లీ’ ముట్టడి

23 నిమిషాల క్రితం

poseter
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 11:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వాల్‌‌పోస్టర్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి - విజయవాడ : లేబర్‌ ‌కోడ్‌‌లు రద్దు చేయాలని కోరుతూ వచ్చే నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరిగే ‘చలో ఢిల్లీ’ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు కోరారు. విజయవాడ బిఆర్‌టిఎస్‌ రోడ్డులోని నండూరి ప్రసాదరావు భవన్‌లో శనివారం సిఐటియు విజయవాడ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ‌వాల్‌‌పోస్టర్‌‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.వి.సుధాకర్, కె.దుర్గారావు మాట్లాడుతూ... కార్మికులకు నష్టదాయకమైన నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.42 వేలు, పెన్షన్ రూ.21 వేలుగా నిర్ణయించాలని కోరారు. రోజురోజుకూ నిత్యావసర సరుకులు, గ్యాస్, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు లక్షలాది కోట్ల పన్ను రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం.. సంక్షేమ పథకాలకు, కార్మికుల వేతనాలకు మాత్రం నిధులు లేవనడం దారుణమని విమర్శించారు. అంగన్‌‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్కర్లతో పాటు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ఢిల్లీ ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నగర కార్యదర్శులు వై.సుబ్బారావు, టి.ప్రవీణ్, ఎం.సోమేశ్వరరావు, ఎం.వి.రమణ, ఎం.బాబూరావు, ఎం.హనుమంతురావు, ఎన్.పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్