గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మరోసారి ఎన్నికల నోటిఫికేషన్‌...

5 రోజుల క్రితం

grama
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 09:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

-17 ఎంపిపి,37 వైస్ ఎంపిపి స్థానాలకు త్వరలో ఎన్నికలు

- సిఇఒల నివేదికల ఆధారంగా షెడ్యూల్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మండల ప్రజాపరిషత్‌ అధ్యక్ష(ఎంపిపి), ఉపాధ్యక్ష (వైస్ ఎంపిపి)లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహించిన సమావేశాల్లోనూ 17 మంది ఎంపిపి, 37 మంది వైఎస్ ఎంపిపిలను ఎన్నుకోలేకపోయారని శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనలో తెలిపింది.సంబంధిత జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారుల (సిఇఒల) నుంచి నివేదికలు స్వీకరించిన అనంతరం తదుపరి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది.ఈ నెల 19వ తేదీ నాటికి 34 మంది ఎంపిపి, 59 మంది వైఎస్ ఎంపిపిల ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు 20వ తేదీన ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో 17 మంది ఎంపిపి, 22 మంది వైస్ ఎంపిపిలను ఎన్నుకున్నారు. మిగిలిన స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తికాలేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 ఎంపిపి స్థానాలకు గాను ఇప్పటివరకు 642 చోట్ల ఎన్నికలు పూర్తయ్యాయి. మరో 17 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వైస్ ఎంపిపి స్థానాల్లో 659కు గాను 622 చోట్ల ఎన్నికలు జరగ్గా, 37 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, మార్కాపురం, తిరుపతి, వైఎస్సార్‌ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పలు మండలాల్లో ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కొన్ని మండలాల్లో ఎంపిపి ఎన్నికలు పూర్తయినా వైస్ ఎంపిపిల ఎంపిక జరగలేదు. ఎన్నికలు నిర్వహించలేకపోయిన 17 ఎంపిపి, 37 వైఎస్ ఎంపిపి స్థానాలకు సంబంధించి నివేదికలు అందిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు చేపట్టనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్