బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోర్టు విచారణల ప్రసారాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

30 నిమిషాల క్రితం

ఏపీ హైకోర్టు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 12:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విచారణలకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు, ఫొటోలు, స్క్రీన్‌షాట్లను అనుమతి లేకుండా రికార్డు చేయడం, ప్రసారం చేయడంపై ఆంక్షలు విధించింది. కోర్టు విచారణలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, వెబ్‌సైట్లు, యాప్‌లలో లైవ్ స్ట్రీమింగ్ చేయడం లేదా ప్రచురించడం నిషేధించినట్లు స్పష్టం చేసింది. కోర్టు విచారణలకు సంబంధించిన దృశ్యాలు, సమాచారాన్ని అనధికారికంగా రికార్డు చేసి ఇతరులకు చేరవేయడం లేదా ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని ఏపీ హైకోర్టు హెచ్చరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్