బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యుత్తు స్టోర్ హమాలీలచే చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ

36 నిమిషాల క్రితం

chitttoor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 12:10 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- కనీస వేతనం 42 వేల సాధనకై కదిలి రండి

- యూనియన్ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు పిలుపు

ప్రజాశక్తి - చిత్తూరు : దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఇతర కార్మికులకు కనీస వేతనాలు 42,000 సాధనకై సిఐటియు ఆధ్వర్యంలో ఢిల్లీ ని ముట్టడించే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బుధవారం చిత్తూరు జిల్లా విద్యుత్ స్టోర్ దగ్గర హమాలీలచే చల్లో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్తు స్టోర్ హమాలీల యూనియన్ సిఐటియు గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మికులకు వేతనాల తగ్గించడమే కాకుండా ఉపాధిని దెబ్బతీస్తున్నదని విమర్శించారు కార్మికుల చట్టాలను రక్షించుకోవడానికి కార్మికులకు కనీస వేతనాలు 42 వేల సాధనకై సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఢిల్లీని ముట్టడించడానికి డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో భారీ కార్యక్రమం జరుగుతున్నదని ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా నుంచి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ‌ ‌ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమీ ప్రభుత్వం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తూచ తప్పకుండా పాటిస్తున్నదని ఆంధ్ర రాష్ట్రంలోని కార్మికులు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు కదంతొక్కుతుంటే ఢిల్లీ ప్రభుత్వం రాంలీల మైదానం పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నదని అయినా కార్మికులతో ఐక్యంగా సిఐటియు త్రిప్పికొడుతుందని హెచ్చరించారు.

నిత్యవసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ కార్మికుల వేతనాల్లో మాత్రం పెరుగుదల లేదని ధ్వజమెత్తారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న స్కీములు ఐసిడిఎస్, ఐకెపి, నేషనల్ హెల్త్ స్కీం తదితరు లాంటి స్కీం వర్కర్లకు వేతనాలు పెంచకుండా వెట్టి చాకిరీ చేయించుకోవడం దుర్మార్గమన్నారు.

గతంలో రైతులు సంవత్సరం పాటు ఢిల్లీని ముట్టడించి మోడీకి మెడలు వంచడం జరిగింది.మరోసారి విద్యార్థులు యువత భారీ సంఖ్యలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై జంతర మంత్ర వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారని అదేవిధంగా కార్మికులు కూడా భారీ స్థాయిలో చలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించి మోడీ ప్రభుత్వం మెడల వంచుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హమాలీల యూనియన్ నాయకులు ఆరోగ్య దాస్, కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్