చెన్నై : ఐఎఎస్ అధికారిణి ఫిర్యాదు మేరకు కల్లకురిచి మహిళా పోలీస్ స్టేషన్ బుధవారం టివికె ఎమ్మెల్యే సి.అరుల్ విగ్నేష్‌కి సమన్లు జారీ చేసింది. స్వయంగా కల్లకురిచి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి, వ్యక్తిగతంగా ఆయనకు సమన్లు ఇచ్చినట్లు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ భువనేశ్వరి తెలిపారు. నివాసంలోనే ఆయనను విచారించామని అన్నారు. ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, అనవసరమైన మెసేజ్‌లు పంపుతున్నారని ఐఎఎస్ అధికారిణి సోమవారం కల్లకురిచి జిల్లా ఎస్‌పికి అధికారికంగా ఫిర్యాదు చేశారు. బిఎన్‌ఎస్‌లోని సెక్షన్లు 75,78,79 సహా పోష్ యాక్ట్ కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. కల్లకురుచ్చి మహిళా పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసులో దర్యాప్తు అధికారిగా నియమితులైన తిరుప్పూర్ జిల్లా ఎస్పీ సృష్టి సింగ్, ఈ ఘటనపై ప్రాథమిక విచారణను బుధవారం ప్రారంభించారని పోలీసు వర్గాలు తెలిపాయి. కల్లకురిచిలోని మహిళా పోలీస్ స్టేషన్, కల్లకురిచి ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఆరోపణలను సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ నిష్పక్షపాతంగా విచారణ జరపాలని తమిళనాడు డిజిపిని కోరింది.
ఐఎఎస్ అధికారిణి ఫిర్యాదుపై టివికె ఎమ్మెల్యేకు సమన్లు
16 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026, 12:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)