మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై 444 కేసులు

31 నిమిషాల క్రితం

స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రత
- ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై 444 కేసులు 
- ఐజి రాజకుమారి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 11:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రత..

  • ఐజి రాజకుమారి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రెండో విడత సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్‌ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు ఐజి బి రాజకుమారి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకత్వంలో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు చేపట్టిన చర్యల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 444 కేసులు నమోదు చేశామన్నారు. మొత్తం 24 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, 200.55 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బిఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్లు 126, 129 కింద 722 కేసుల్లో 5,327 మందిని బైండోవర్‌ చేశామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు.​

పోలింగ్‌కు 44 గంటల ముందే మద్యం విక్రయాల నిలిపివేత

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాల మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 44 గంటల ముందుగానే మద్యం దుకాణాలను మూసివేయాలని నిర్ణయించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయని తెలిపింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా మెజిస్ట్రేట్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మొదటి విడత పోలింగ్ తేదీ అయిన ఈ నెల 26న, రెండో విడత పోలింగ్ తేదీ అయిన 29న, మూడో విడత పోలింగ్ అయిన వచ్చే నెల 2న సంబంధిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసే సమయానికి 44 గంటల ముందు నుంచి మద్యం దుకాణాలు మూసివేయాల్సి ఉంటుందని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్