మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదగా డిఎస్‌‌సి వద్దు.. మెగా డిఎస్‌‌సి కావాలి

15 నిమిషాల క్రితం

దగా డిఎస్‌‌సి వద్దు.. మెగా డిఎస్‌‌సి కావాలి
- కెఎస్ లక్ష్మణరావు, జి రామన్న image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 11:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కెఎస్ లక్ష్మణరావు, జి రామన్న

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగులు డిఎస్‌‌సి కోసం ఎదురుచూస్తుంటే కేవలం 2,721 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులను మోసం చేయడమేనని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న విమర్శించారు. తక్షణమే పోస్టుల సంఖ్య పెంచి మెగా డిఎస్‌‌సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎం రమణ అధ్యక్షతన డిఎస్‌‌సి అభ్యర్థులు విజయవాడ ధర్నాచౌక్‌లో మంగళవారం నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు, రామన్న మాట్లాడుతూ.. 10 జిల్లాల్లో ఎస్‌జిటి పోస్టులు సున్నా ఉండగా, మరో ఆరు జిల్లాల్లో కేవలం రెండు, మూడు పోస్టులే ప్రకటించడం అన్యాయమన్నారు. అప్పులు చేసి, కుటుంబాలకు దూరంగా ఉంటూ కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేబినెట్ ఆమోదించిన 2,260 స్పెషల్ డిఎస్‌‌సి పోస్టులను భర్తీ చేయకుండా, ప్రస్తుతం 350 పోస్టులకే పరిమితం చేయడాన్ని తప్పుబట్టారు. డిఎస్‌‌సి అభ్యర్థులకు వయోపరిమితి పెంచాలని, ఆన్‌లైన్‌కు బదులుగా ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని, ప్రతి పాఠశాలలో పిఇటి పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్‌ను సవరించి మెగా డిఎస్‌‌సి ప్రకటించాలని కోరారు. ఈ ధర్నాకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి రామ్మోహన్, కె ప్రసన్నకుమార్, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మల్యాద్రి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరావమ్మ, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ అశోక్, జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మద్దతు తెలిపారు. డివైఎఫ్ఐ నాయకులు బి నరసింహ, మహేష్, చైతన్య, శివ, నగర నాయకులు గౌస్, నోహిత్ కృష్ణ, బసవ, నిరుద్యోగులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్