mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నావికుల మృతిపై ప్రధాని మోడీని నిలదీసిన చీఫ్ మెరైన్ ఇంజనీర్ భార్య

1 గంట క్రితం

Wife of Chief Marine Engineer confronts
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 04:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖపట్నం: "భారతీయ సిబ్బంది ప్రాణాలు ఎందుకు కోల్పోవాలి?" అని చీఫ్ మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ భార్య భార్గవి కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రమాదంలో ముగ్గురు నావికులు మరణించినా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె పలు ప్రశ్నలు సంధించారు. "ప్రమాదంలో ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయారు. భారతీయ సిబ్బంది ఎందుకు చనిపోవాలి? ఈ ఘటనపై ఇప్పటివరకు ఎవరూ సరిగ్గా స్పందించలేదు. నేను నేరుగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని (పిఎంఒ) అడుగుతున్నాను... బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయం అందిస్తారు? ఇదే ప్రశ్నను నేను అమెరికా ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను. నా భర్తే మా కుటుంబానికి జీవనాధారం. ఇప్పుడు ఆయన లేకపోతే నేను నా పిల్లలను ఎలా పెంచాలి?" అని భార్గవి కేంద్రాన్ని ప్రశ్నించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్