ప్రజాశక్తి-రేపల్లె (భట్టిప్రోలు) : మోటూరు హనుమంతరావు 25 వ వర్ధంతి సందర్భంగా వెల్లటూరులో సభ నిర్వహించడం జరిగింది. బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్.గంగయ్య సీనియర్ నాయకులు బిఎల్కే ప్రసాద్ మోటూరు హనుమంతరావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జెండా ఆవిష్కరణ పార్టీ సీనియర్ నాయకులు నాగేశ్వరావు చేశారు. అనంతరం జరిగిన సభకు భటిప్రోలు మండల కార్యదర్శి పి.మనోజ్ కుమార్ అధ్యక్షత వహించారు సభను ఉద్దేశించి సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో విద్యార్థి గా భగత్ సింగ్ ఉరితీసినప్పుడు జరుగుతున్న స్కూల్స్ కాలేజీల సమ్మెలో పాల్గొని ఆ చైతన్యంతో కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షతుడై ఆంధ్రరాష్టంలో కమ్యూనిస్టు అగ్రనాయకులుగా రాజ్యసభ సభ్యుడుగా,రేపల్లె నియోజకవర్గ తొలి శాసనసభ్యుడు,పాత రేపల్లె తాలూకా వెల్లటూరు గ్రామంలో ఒక పేద రైతంగా కుటంబంలో మోటూరి జన్మించారు.ప్రజాశక్తి తెలుగు వార్తాపత్రిక వ్యవస్థాపక సంపాదకులుగా సాహిత్య రంగంలో ప్రజా సమస్యలు పట్ల కార్మికులు రైతాంగం సమస్యలుపై పూర్తి అవగాహన కలిగి వాటిని ప్రతి పంపించే విధంగా వార్తలు కాసేవాడు రాష్ట్రంలో,ఈ ప్రాంతంలో బంజర్ భూములు పేదలకు పంపిణి చేయాలిని వ్యవసాయ కూలీల కూలీ రెట్లు పెంపుదల కోసం పెద్దఎత్తున పోరాటాలు నడిపాడు,రేపల్లె ప్రాంత ప్రజాసమస్యలపై తన ఉద్యమ ప్రస్థానం ప్రారంభించి ప్రజాజీవితంలో తుదిశ్వాస విడిచే వరకు పోరాటాలు నడిపినా వ్యక్తి మోటూరి అన్నారు. నేడు దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు కార్పొరేట్లకు ప్రజా సంపాదన అప్పగిస్తున్నారు కార్మికులు రైతులు పేద ప్రజల పై ధరల పెంచుతూ సామాన్యుల మట్టి విరుస్తున్నారని ఈ దేశంలో రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన మాట్లాడుతున్నది సిపిఎం పార్టీ అని అన్నారు నరేంద్ర మోడీ అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోయి పంపు విధానాలకి అటాచ్ పలుకుతున్నాడని ఫలితంగా దేశంలో సంక్షోభం ఏర్పడే పరిస్థితులు వచ్చాయి లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసి వాటిని అదాని అంబానీలకు కార్పొరేట్ల ఆస్తులు పెంచడానికి ఉపయోగిస్తున్నాడు మరోవైపు దేశంలో మతం పేరుతో ప్రాంతాల పేరుతో విద్వేషాలను సృష్టిస్తూ మత ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాడని మోడీ మిత్రులుగా రాష్ట్రంలోని పాలక పార్టీలు ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి రాష్ట్రానికి కావలసిన అవసరమైన నిధులను సాధించడంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలం చెందారు మోడీ విధానాలకు వంతపడుతూ రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం మాటల యుద్ధం సాగుతుందని దీనిని ప్రజలందరూ గమనించాలని రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రత్యేక హోదా విభజన చట్ట హామీలను సాధించడంలో విఫలం చెందారని అన్నారు సిపిఎం పార్టీ ప్రజల మద్దతుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోతున్న కార్మికులు వ్యవసాయ కూలీలు రైతులు పేద ప్రజలు పక్షాన పోరాటాలు చేస్తుందని దానికి మోటూరి హనుమంతరావు గారి ఆశయ సాధనలో ప్రజల పక్షం వైపు నిలబడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు టి కృష్ణమోహన్ భట్టిప్రోలు కొల్లూరు మండల నాయకులు జి. సుధాకర్, మురుగుడు సత్యనారాయణ, గోళ్ళ నాగరాజు, దీపాల సత్యనారాయణ రామస్వామి,బి.అగస్టీన్ నాగమల్లేశ్వరరావు,బొనిగల సుబ్బారావు మరియరావు పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఘనంగా మోటూరు 25వ వర్ధంతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 19, 2026, 04:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)