చంపావత్ : ఉత్తరాఖండ్ చంపావత్ లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లోయలో పడి మంటలు చెలరేగి.. పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ చంపావత్ బారాకోట్ ప్రాంతంలో బాప్రు-బంటోలి రోడ్డు సమీపంలో 200 మీటర్ల లోతైన లోయలో కారు పడి మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా కంట్రోల్ నుండి సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్ డి ఆర్ఎఫ్) అక్కడికి చేరుకుంది. చంపావత్‌కు చెందినఎస్ డి ఆర్ఎఫ్ బృందం, సబ్-ఇన్‌స్పెక్టర్ దుంగర్ సింగ్ నేతృత్వంలో అవసరమైన సహాయక చర్యల పరికరాలతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. ఆ బృందానికి, లోతైన లోయలో వాహనం మంటల్లో చిక్కుకుని పడి ఉండటం కనిపించింది. ఈ ప్రమాదంలో ముగ్గురిని నీతు దేవి, అక్షిత, ఆరవ్‌లను రెస్క్యూ బృందం సురక్షితంగా రక్షించింది. గాయాలైన వీరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించింది.
మృతులను అంజెడ డిడిహాట్‌కు చెందిన డ్రైవర్ రాజేంద్ర కుమార్ (47), నాంకోడి నివాసి బల్దేవ్ కుమార్ (34), మరో ముగ్గురి మృతదేహాలు ఎవరివనేది పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పోలీసులు తరలించారు.








కామెంట్‌లు (0)