తాడేపల్లి (గుంటూరు) : చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా …. రేపు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైసిపి ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించారు. డీఎస్సీ అవకతవకల అంశంపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ …. ఎపి డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో ఎన్నో అక్రమాలు జరిగాయని, చంద్రబాబు సర్కార్ అవకతవకలు దిగ్భ్రాంతికి గురి చేశాయని ఆరోపించారు. పేపర్ లీకుల్లో చంద్రబాబుదే రికార్డు అని చెప్పారు. డీఎస్సీ పరీక్షల పేరుతో చంద్రబాబు, మంత్రి లోకేష్ కలిసి అక్రమాలకు పాల్పడ్డారనీ, తప్పులను ఎత్తిచూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోందని ఎద్దేవా చేశారు. ఇది జెన్‌జీ కాలం.. దేన్నీ చంద్రబాబు ఆపలేరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా …. రేపు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైసిపి అధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. డీఎస్సీ విషయంలో ఇవాళ వెలుగులోకి వస్తున్న విషయాలన్నీ చూస్తుంటే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయన్నారు. లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం వమ్ము చేసిందని మండిపడ్డారు. డీఎస్సీ అంటే లక్షల మంది యువత ఆశ. వారి భవిష్యత్తు అని, అలాంటి ఉద్యోగ నియామక ప్రక్రియలో కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడటం అత్యంత దారుణమన్నారు. 16వేల పోస్టులకే ఇన్ని స్కామ్‌లు, లీకులు కనిపిస్తున్నాయన్నారు. మెగా డీఎస్సీ అనడానికి అర్హత లేదు.. అని చెప్పారు. తమ ప్రభుత్వంలో ఒకే సమయంలో ఒకే నోటిఫికేషన్ ఇచ్చామని జగన్ చెప్పారు. లక్షా 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశామన్నారు. 2019 మే 30న సిఎంగా ప్రమాణం చేసిన 50 రోజుల్లోనే జిఒ ఇచ్చామని తెలిపారు. 19 లక్షల మంది పరీక్షలు రాస్తే ఒక్క తప్పు కూడా జరగలేదు అని అన్నారు. నాలుగు నెలల్లోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ భర్తీ పూర్తి చేశామన్నారు. ఇప్పుడు మాత్రం డీఎస్సీ పేరుతో అభ్యర్థులకు ఆవేదన మిగిల్చారు అని అన్నారు.
రేపు రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ర్యాలీలు : వైఎస్.జగన్
11 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 11, 2026, 01:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)