శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికలు జరగకుండా చేయాలన్నదే వైసిపి కుట్ర : బొండా ఉమ

24 నిమిషాల క్రితం

YCP’s conspiracy is to prevent elections from taking place: Bonda Uma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 03:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : ఎలాగైనా ఎన్నికలు జరగకుండా చేయాలన్నదే వైసిపి కుట్ర అని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .... అభ్యర్థుల చేతిలో నామినేషన్లు లాక్కొని చించేశారని మండిపడ్డారు. విధ్వంసం వైసిపివారు సృష్టించి.. ఆ నెపం టిడిపి పై పెడుతున్నారని ఆక్షేపించారు. పుంగనూరుతోపాటు చాలా చోట్ల వైసిపి విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు. 2021లో వైసిపి హయాంలో ఎన్నికలు జరిగితే.. అడ్డగోలుగా బెదిరింపులతో ఏకగ్రీవాలు చేయలేదా ? అని ప్రశ్నించారు. దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలతో ఎంతమందిని బెదిరించారో ప్రజలందరికీ తెలుసునన్నారు. '' మాచర్లలో నాపైనా హత్యాయత్నం చేశారు.. భగవంతుడి ఆశీస్సులు ఉండబట్టి బయటపడ్డా `` అని చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్