శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పట్టణ స్థానిక సంస్థలకు 1న పోలింగ్‌

-516 నిమిషాల క్రితం

Bugle sounded for local body elections in AP – Schedule released.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 08:51 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నాలుగు చోట్ల నామినేషన్ల గడువు పొడిగింపు

  • నేడు, రేపు దాఖలుకు అవకాశం

  • కలెక్టర్‌ ‌కార్యాలయాల్లోనూ స్వీకరణ

  • సవరించిన షెడ్యూల్‌ ‌విడుదల చేసిన ఎస్‌ఇసి

​ప్రజాశక్తి -అమరావతి బ్యూరో : సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాల్టీల ఎన్నికల షెడ్యూల్‌‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో నవంబర్‌ ‌ ఒకటవ తేదిన పోలింగ్‌ ‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన ఎన్నికల షెడ్యూల్‌‌ను ‌రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా గురువారం రాత్రి విడుదల చేశారు. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు నవంబర్‌ ఒకటవ తేదిన పోలింగ్‌ ‌నిర్వహించనున్నట్లు, రీ పోలింగ్‌ అవసరమైతే 2వ తేది జరిపి, మూడవ తేది ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తాజాగా విడుదల చేసిన షెడ్యూల్‌‌లో పేర్కొన్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తిన కారణంగా నామినేషన్లు దాఖలు చేయలేక పోయిన అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్ల దాఖలుకు గడువు పొడిగించారు. వైఎస్‌ఆర్‌ ‌కడప జిల్లాలో కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌, రాజంపేట మున్సిపాలిటీ లలో కొన్ని వార్డులకు మైదుకూరు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లోనూ నామినేషన్ల దాఖలుకు మరోసారి అవకాశం కల్పించారు. తిరుపతి జిల్లాలోని తిరుపతి మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌‌లో కూడా కొన్ని వార్డులలో నామినేషన్ల గడువు పొడిగించారు.

ఇక్కడ ఈ నెల 23, 24 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే ప్రకటించిన నామినేషన్‌ కేంద్రాలతో పాటు, సంబంధిత కలెక్టర్‌ కార్యాలయాల్లో కూడా నామినేషన్లు స్వీకరించను న్నారు. . ‘కలెక్టర్‌ ‌కార్యాలయంలో గానీ, లేదా జిల్లా ఎన్నికల అధికారి సూచించిన కలెక్టరేట్‌ ‌ప్రాంగణం లోని ప్రత్యేకం ప్రాంతాల్లోగాని నామినేషన్లు స్వీకరించవచ్చు’ అని షెడ్యూల్‌ ‌లో తెలిపారు.

బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా 25న రాష్ట్రమంతా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 25వ తేది ప్రచురించనున్నారు. పొడిగించిన గడువులో కొత్తగా దాఖలైన నామినేషన్లను అక్టోబర్‌ 25న ఉదయం 8 గంటల నుంచి పరిశీలిస్తారు. కొత్తగా నామినేషన్లు దాకలు చేసిన అభ్యర్థులకు మాత్రమే అదే రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్‌ 25న మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రచురిస్తారు. రాష్ట్రంలోని మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అదే రోజు ప్రకటిస్తామని షెడ్యూల్‌‌లో తెలిపారు.

సుదీర్ఘ కసరత్తు

శాంతి భద్రతల సమస్యల కారణంగా అనేక చోట్ల నామినేషన్లు దాఖలు చేయలేకపోయామంటూ వైసిపితో పాటు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆదేశించిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్లు, ఎస్‌‌పిల నుండి అందిన నివేదికలను రాష్ట్ర ఎన్నికల అధికారులు పరిశీలించారు. బుధవారం రాత్రి నుండే ఈ కసరతుత ప్రారంభించారు.ఒకవైపు సుప్రీంతీర్పును అధ్యయనం చేస్తూ, మరోవైపు జిల్లాల నుండి వచ్చిన నివేదికలను పరిశీలించే ప్రక్రియను అధికారులు నిర్వహించారు. గురువారం లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి నామినేషన్ల గడువు పొడిగింపు పై నిర్ణయం తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడంతో ఆ మేరకు గురువారం ర్రాతి పది గంటల ప్రాంతంలో తాజా షెడ్యూల్‌‌ను విడుదల చేశారు. గడువు పొడిగిస్తే నామినేషన్ల దాఖలుకు కనీసం 48 గంటల సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో నేడు, రేపు (శుక్ర,శని వారాల్లో) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని నిర్ణయించారు.

​​Screenshot from 2026-10-23 00-31-22.png


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్