mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉండవల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించిన సి ఆర్ డి ఏ

09 జూన్, 2026

సభలో మాట్లాడుతున్న కమిషనర్ విజయరామరాజు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 09, 2026, 04:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి బ్యూరో :

అమరావతి నగర నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా మంగళవారం ఉండవల్లిలో గ్రామసభ జరిగింది. దీనికి కమిషనర్వి విజయరామరాజు, అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ, కొల్లాబత్తుల కార్తీక్ హాజరయ్యారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతురాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, ఎల్ పి ఎస్ జోన్లు , పంపింగ్ స్టేషన్ తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్) చేపట్టామని  సమీకరణకు కొందరు రైతులు, భూయజమానులు ముందుకు రానందున..రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే ఇటీవల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేశామని వివరించారు. భూసమీకరణలో పాల్గొనేందుకు రైతులకు ఇప్పటికీ అవకాశం ఉందని, ఇటీవల విడుదల చేసిన భూసేకరణ ప్రకటనలో పేర్లు ఉన్నప్పటికీ సంబంధిత రైతులు నిర్ణీత గడువులోపు భూసమీకరణలో పాల్గొనేందుకు అవకాశముందని  స్పష్టం చేశారు. అధికారుల విజ్ఞప్తి మేరకు ఉండవల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఇటీవల పూలింగ్ కింద భూములు ఇచ్చి సహకరించారన్నారు. గ్రామస్తులు గ్రామసభలో వెల్లడించిన అసైన్డ్ భూములు, లంక భూముల సమస్యలను ప్రభుత్వ ఆదేశానుసారం పరిష్కరిస్తామన్నారు. ఉండవల్లి గ్రామంలో సైతం ప్రముఖ విద్యా, వైద్య తదితర సంస్థలను ఏర్పాటు చేయాలని స్థానికులు చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని కమిషనర్ చెప్పారు.


రాజధాని అమరావతి గ్రామాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామని కమిషనర్ గారు పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నందున, రాజధాని గ్రామాల రైతులు అధికారులకు సహకరించాలన్నారు. అలాగే రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు స్థానికంగా అందుబాటులో ఉండే కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్