mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కృష్ణలంక సిఐ నాగరాజుపై కేసు నమోదు

1 గంట క్రితం

Case registered against Krishnalanka CI Nagaraju.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 11:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : విజయవాడలో సస్పెండైన కృష్ణలంక సిఐ నాగరాజుపై కేసు నమోదైంది. గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు..127 (4), 127(6), 103(1), 238 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సిఐ నాగరాజుపై హత్య కేసును నమోదు చేసిన పోలీసులు నేడు ఆయనను అరెస్ట్ చేసే అవకాశముంది. సిఐ నాగారాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన ఈరోజు లొంగిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. సాయికృష్ణ అదృశ్యంపై దర్యాప్తు అధికారిగా నియమితులైన రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిశోర్‌ శుక్రవారం విజయవాడకు రానున్నారు. ఆయన ముందుగా డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా, విజయవాడ సిపి రాజశేఖర బాబులను కలవనున్నారు. వారితో చర్చించాక కృష్ణలంక స్టేషన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.


సంబంధిత వార్తలు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్