శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అందాల నటుడు శోభన్ బాబు భార్య కన్నుమూత

2 గంటల క్రితం

Wife of handsome actor Sobhan Babu passes away.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 09:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో అందాల నటుడిగా, ‘సోగ్గాడు’గా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన సినీనటుడు శోభన్‌బాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య శాంతకుమారి (86) గురువారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. నాలుగు రోజుల క్రితమే చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. నిన్న (గురువారం) ఆస్పత్రిలో ఆమెను పరామర్శించేందుకు ఓ ఆప్తమిత్రురాలు వచ్చారు. ఆ స్నేహితురాలితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టుకు గురై ఆమె తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. శాంతకుమారి భౌతికకాయాన్ని చెన్నైలోని వారి నివాసానికి తరలించారు. ఆమె భౌతికకాయానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆమె మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. శోభన్ బాబు-శాంతకుమారి దంపతులకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శోభన్ బాబు సినిమా రంగంలో అగ్రహీరోగా ఎదిగినప్పటికీ.. ఆయన భార్య శాంతకుమారి ఎప్పుడూ ప్రచారానికి దూరంగా, నిరాడంబరంగా జీవితాన్ని గడుపుతూ ఆయనకు కొండంత అండగా నిలిచారని సన్నిహితులు చెబుతున్నారు. 2008 సంవత్సరంలో శోభన్ బాబు గుండెపోటుతో కన్నుమూసిన సంగతి విదితమే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్