శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రశ్న రావణ్ ఇంట్లో ఎపి పోలీసుల సోదాలు

1 గంట క్రితం

ప్రశ్న రావణ్ ఇంట్లో ఎపి పోలీసుల సోదాలు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 11:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : వివాదాస్పద యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న రావణ్’ నివాసంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ శివార్లలోని అమీన్‌పూర్‌లో గల ఆయన నివాసంలో గన్నవరం పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. గంటల తరబడి సాగిన ఈ సోదాల్లో కొన్ని కీలక పత్రాలు, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గన్నవరం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎనిమిదిమంది అధికారుల బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొంది. సోదాల అనంతరం రావణ్ భార్యను విచారించిన పోలీసులు.. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తనిఖీ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించారు. ఈ ఆపరేషన్‌లో స్థానిక పోలీసులు భద్రతతో పాటు ఇతర సహాయ సహకారాలను అందించారు. గత రెండేళ్లుగా అమీన్‌పూర్‌లోని నరేంద్ర నగర్ కాలనీలో రావణ్ నివసిస్తున్నారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు, ఇతర ఆరోపణలకు సంబంధించి ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగానే పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు. కాగా, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద గన్నవరం పోలీసులు ఇటీవల రావణ్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్