ఈ సంవత్సరం నేను చాలా నేర్చుకున్నాను..
తెలుగు స్పష్టంగా రాయడం నేర్చుకున్నాను..
కొంతమంది ఆంగ్లం కష్టమంటారు..
మాట్లాడటం కష్టమంటారు…
కానీ నేను ఆంగ్లం నేర్చుకున్నాను..
అది ఎంత గొప్పదో చెప్పాను..
ఈ సంవత్సరం ఆడుతూ, పాడుతూ గడిచింది..
ఆటపాటలతో ఎంతో అలరించింది..
ఈ సంవత్సరం నేను ఊహించింది జరిగింది..
కల్చరల్ ఫెస్ట్ మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచింది…
నాకు ఎంతో ఇష్టమైన ఆటలు నేర్పించింది..
అందరినీ ఉత్సాహపరిచింది ఈ సంవత్సరం..
ఆనందాన్ని పంచింది ఈ సంవత్సరం..
ఆటల పాటలతో గడిచింది..
సంతోషాన్ని తెచ్చింది ఈ సంవత్సరం..
సంవత్సరం మొదలంతా అల్లరి చేశాం..
సంవత్సరం పూర్తి అయితే ఏడుస్తున్నాం..
ఫైనల్ పరీక్షలకు ముందు చదువుతాం…
టీచర్ల దగ్గర తెలియంది నేర్చుకుంటాం..
గొప్పవాళ్ళమై వాళ్లకి ఆనందాన్ని ఇస్తాం..
ఇలా ఈ సంవత్సరం గడిచిపోయింది..
పి.ప్రదీప్తి
8వ తరగతి, అరవింద మోడల్ స్కూల్,
మంగళగిరి, గుంటూరు జిల్లా.
Print Editionవిద్యాసంవత్సరపు ప్రయాణం…
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 14, 2026, 12:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)