శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులా...? లేక టీడీపీ ఉద్యోగులా..?

17 నిమిషాల క్రితం

Are the police government employees... or are they TDP employees?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 04:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

-- నామినేషన్ హక్కును అడ్డుకుంటారా ...? ప్రశ్నిస్తే లాఠీచార్జ్ లా..?


ప్రజాశక్తి-వాల్మీకిపురం (అన్నమయ్య జిల్లా) : చివరి రోజు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించకుండా టిడిపి నేతలు పోలీసులను అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలపై దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి తనయుడు చింతల సాయి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక గాంధీ బస్టాండ్ వద్ద ధర్నా చేస్తున్న చింతల సాయి కృష్ణారెడ్డి, వైసీపీ నాయకులపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. సిఐ రాఘవరెడ్డిని నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించాలని కొరడంతో టిడిపి ఉద్యోగిలా వ్యవహరించి వైసీపీ నాయకులపై దాడులు చేశారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీ తొత్తులా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. అనంతరం చింతల సాయి కృష్ణారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బిడ్డల కేశవ రెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ మనం ప్రజాస్వామ్యంలో లేమనారు. చివరి రోజు నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులను టిడిపి నేతలు వారి వెంట తెచ్చుకున్న గుండాలతో అడ్డుకొని దాడులు చేస్తున్నారన్నారు. నామినేషన్ వేయించాలని అడిగితే పోలీసులు లాఠీ చార్జి చేయడం పై ఆయన మండిపడ్డారు. పోలీసులు సైతం టిడిపి నేతలకు తొత్తులా వ్యవహరిస్తూ వైసీపీ అభ్యర్థులపై దాడులు, లాఠీ చార్జిలు చేస్తుండడం గమనార్హం. పోలీసుల లాఠీచార్జిలో వైసీపీ నేతలు గాయపడ్డారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్