తిరువనంతపురం : కేరళం 29వ గవర్నర్‌గా ఓం ప్రకాష్ మాథుర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సౌమెన్ సేన్ ఆయనతో ప్రమాణం చేయించారు. తొలుత, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన నియామక ఉత్తర్వులను చదివి వినిపించారు. అనంతరం ఆయన ప్రమాణం చేసి, బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వి.డి. సతీశన్, స్పీకర్ తిరువంచూర్ రాధాకృష్ణన్, మంత్రులు పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా హాజరయ్యారు. రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తమిళనాడు గవర్నర్‌గా నియమితులు కావడంతో, ఆయన స్థానంలో మాథుర్ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని చేపట్టకముందు, మాథుర్ సిక్కిం గవర్నర్‌గా పనిచేశారు.






కామెంట్‌లు (0)