అగ్నికి ఆహుతైన-50 లక్షల గోల్డెన్ బేంబు పంట
ప్రజాశక్తి , కడియం: కడియం మండలం, మాధవ రాయుడుపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని, చైతన్య నగర్ లో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో, సుమారు 50 లక్షల రూపాయలు విలువైన గోల్డెన్ బేంబు (వెదురు కర్ర) పంట అగ్నికి ఆహుతి అయ్యింది. మండలంలోని బుర్రిలంక గ్రామానికి చెందిన ఈశ్వరా ఫాం అండ్ నర్సరీ అధినేత తాడాల విష్ణు చక్రవర్తి భార్య రాజరాజేశ్వరి కి చెందిన సుమారు 5 ఎకరాల నర్సరీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మాధవ రాయుడుపాలెం వీఆర్వో జి.వెంకట్రావు కడియం ఎమ్మార్వో కార్యాలయానికి సమాచారం అందించారు. మంటలను గమనించిన చైతన్య నగర్ యువకులు రాజమహేంద్రవరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో పాటు, మంటలు అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. రాజమహేంద్రవరం నుండి వచ్చిన ఫైర్ ఇంజన్, స్థానిక పేపర్ మిల్లు కి చెందిన ఫైరింజన్లు సుమారు ఐదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.
చైతన్య నగర్ లో అగ్నిప్రమాదం
09 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 09, 2026, 12:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)