mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అధికారుల వేధింపుల వల్లే వీఆర్వో హుస్సేన్ మృతి

09 జూన్, 2026

వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 09, 2026, 03:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ :

కర్నూలు జిల్లా వెంకాయపల్లి విఆర్ఓ మహ్మద్ హుస్సేన్ మరణానికి కారణమైన అధికారులపై తక్షణమే చట్ట పరమైన చర్యలు తీసుకుని ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని కాకినాడ జిల్లాలోని వివిధ మండలాలు చెందిన వీఆర్వోలు నిరసన వ్యక్తం చేశారు. అంతే కాకుండా అధికారుల వేధింపులు వల్ల మృతి చెందిన హుస్సేన్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విఆర్ఓల జేఏసీ నిరసన చేశారు.


ఈ సందర్భంగా వీఆర్వో సంఘం జాయింట్ సెక్రటరీ అనిశెట్టి రామకృష్ణ, నాయకులు మల్లేష్, కిషోర్ ఆధ్వర్యంలో విఆర్వోలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విఆర్ఓ హుస్సేన్ అనారోగ్యం గురైనానని తనకు సెలవు కావాలని అడిగినా అవేమి పట్టించుకోకుండా అధికారులు కావాలని వేదించారన్నారు. సమయపాలన లేక అనేక కారణాలతో వీఆర్వోలు మరణించినట్లు చెప్పారు. ఈనెల 11వ తేదీన కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం నిరసన చేస్తామని వారు చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్