mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పూర్తయిన జ్యోతుల పాపారావు సాగునీటి పథకం పనులు

2 గంటల క్రితం

MLA Jyothula
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 03:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - జగ్గంపేట : మండలంలోని మామిడాడ వద్ద ఏర్పాటు చేసిన జ్యోతుల పాపారావు సాగునీటి పథకం పనులు పూర్తి అయ్యాయని జగ్గంపేట ఎంఎల్ఎ జ్యోతుల నెహ్రు పేర్కొన్నారు. గురువారం ఆ పనులను రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మామిడాడ, ఇర్రిపాక , మర్రిపాక, గొల్లలగుంట, నరేంద్రపట్నం గ్రామాల రైతుల దశాబ్దాల సాగునీటి కష్టాలు తీర్చేందుకు రూ.3.50 లక్షలతో ఈ పథకం పనులు పూర్తి చేశామని అన్నారు. కాలువలు, మోటార్లు, పైపులైన్ల పనులన్నీ వంద శాతం పూర్తయ్యాయని, ట్రయల్ రన్ కూడా విజయవంతమైందని తెలిపారు. తొందరలోనే ప్రారంభించి నీళ్లు విడుదల చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, క్లస్టర్ ఇంచార్జి బస్వా చినబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోదిరెడ్ల సుబ్బారావు, నీటి సంఘం చైర్మన్ జ్యోతుల ఈశ్వరరావు, జ్యోతుల సత్యమూర్తి, మామిడాడ, ఇర్రిపాక గ్రామాల రైతులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్