బళ్లారి : కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లను గురువారం ప్రారంభించారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కర్ణాటక సిఎం డి.కె.శివకుమార్, తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డిలు నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ కొత్త గేట్లను అమర్చాల్సిందిగా సూచించింది. రూ.51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. ఈ కార్యక్రమంలో మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లను ప్రారంభించిన ముగ్గురు సిఎంలు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 25, 2026, 04:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)