mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మైనార్టీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్సీ

1 గంట క్రితం

MLC conducts surprise inspection of minority residential school
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 05:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆహరంలో నాణ్యత లోపిస్తే అధికారులపై చర్యలు తప్పవూ

మెను విషయంలో సిబ్బందిపై అగ్రహం

పాఠశాల ప్రిన్సిపాల్ పై చర్యలకు జిల్లా అధికారులకు పిర్యాదు :ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

ప్రజాశక్తి - వేంపల్లె : ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహర విషయంలో నాణ్యత లోపిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హెచ్చరించారు. గురువారం వేంపల్లెలోని కుప్పాలపల్లె రహదారిలో ఉన్న మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, విద్యార్థులకు అందుతున్న భోజన సదుపాయాలపై ఎమ్మెల్సీ స్వయంగా పరిశీలించారు. అలాగే నేరుగా విద్యార్థినులతో కలిసి వారికి అందుతున్న వసతులు, భోజన నాణ్యతపై ఆరా తీశారు.అనంతరం వంటగదిని, స్టోరు గదిని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు అందిస్తున్న పాలు, కోడిగుడ్లును పంపిణీ చేయకపోవడంపై అధికారులు, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వంటకు ఉపయోగిస్తున్న కూరగాయలు కూడ నాణ్యత లోపించడంతో పాఠశాల సిబ్బందిని మందలించారు. విద్యార్థుల ఆరోగ్యం, ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి హెచ్చరించారు. మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఆహర విషయంలో జరుగుతున్న నాణ్యత, మెనుపై ఎమ్మెల్సీ జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి ఫోన్ ద్వారా మాట్లాడడం పాటు అధికారులు, సిబ్బందిపై పిర్యాదు చేశారు. మెనూ పాటించని సంబంధిత బాధ్యులపై, పాఠశాల ప్రిన్సిపాల్ పై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను కోరారు. గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యా, వైద్య సదుపాయాలతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, వాటిని పాఠశాలలో పని చేస్తున్న అధికారులు దుర్వినియోగం చేయడం సరైనది కాదన్నారు. మెనూ, నాణ్యతపై సిబ్బంది పద్దతి మార్చుకోక పోతే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. వంట గది కూడ పరిశుభ్రంగా ఉండాలని హెచ్చరించారు. ఎమ్మెల్సీతో పాటు మాజీ ఎంపిటిసి జివి రమణ, టిడిపి నేత కోనేటి మహేష్ తో పాటు పలువురు టిడిపి నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్