బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ను రద్దు చేయాలి

1 గంట క్రితం

utf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 01:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- నిరసన ర్యాలీ

ప్రజాశక్తి - మార్కాపురం : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మార్కాపురం జిల్లా ఆధ్వర్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని నిరసన ర్యాలీని మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వహించడమైనది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2010 సంవత్సరం ముందు ఉపాధ్యాయులుగా నియమితులైనటువంటి ఉపాధ్యాయులకు TETను కంపల్సరీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం అయినది. ఇటీవల విడుదల చేసిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల స్పెషల్ టెట్ నోటిఫికేషన్ లో ఉపాధ్యాయులకు ఎలాంటి న్యాయం జరిగే విధంగా లేదు. జనరల్ టెట్ కి స్పెషల్ టెట్ కు ఎలాంటి తేడా లేదు. విద్యాహక్కు చట్టంలో మార్పు చేసేంతవరకు పాస్ పర్సంటేజ్ మార్కులు 40% తగ్గించాలి .టెట్ పరీక్షలు మాన్యువల్గా నిర్వహించాలి అని UTF అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, కానీ ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. తమిళనాడు ప్రభుత్వం ఇన్ సర్వీసు ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయిస్తూ శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలాంటి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓవి వీరారెడ్డి జిల్లా కోశాధికారి బి శ్రీరాములు జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ పీ ప్రభాకర్ కార్యదర్శిలు వెంకటేశ్వర్లు రవికుమార్ వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్