ధర్మవరం : ధర్మవరం పట్టణంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. పార్థసారథి నగర్‌లోని సిరికల్చర్ కార్యాలయం సమీపంలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద ఉంచిన లడ్డూ ప్రసాదాన్ని ముస్లిం దంపతులు వేలంపాటలో దక్కించుకున్నారు. శనివారం నిర్వహించిన వేలంపాటలో చాందిని, మస్తాన్ వలి దంపతులు రూ.1,45,000కు లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో అక్కడ మత సామరస్యానికి సంబంధించిన సానుకూల వాతావరణం నెలకొంది. వేలంపాటలో లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్న దంపతులను వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
మత సామరస్యం - లడ్డూ ప్రసాదం ముస్లిం దంపతుల సొంతం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 05:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)