ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మా షరతులను అంగీకరించేంతవరకు హార్ముజ్‌ను తిరిగి తెరవం : ఇరాన్‌

49 నిమిషాల క్రితం

ghalibaf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 05:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టెహ్రాన్‌ : తమ ఏడు షరతులకు అమెరికా అంగీకరించేంత వరకు హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరిచేది లేదని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బఘేర్‌ ఘలిబాఫ్‌ ఆదివారం స్పష్టం చేశారు. ఇరాన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ, యుద్ధమా లేదా చర్చలా అని రెండింటిలో ఒకదానిని ఎంచుకోవాల్సిన పరిస్థితి లేదని, ఇరాన్‌ సైనికంగా పోరాడుతూనే సరైన సమయంలో దౌత్యపరంగా చర్చలు జరపాలి అని ఆయన అన్నారు. ప్రత్యర్థిపై సైనిక ఒత్తిడి పెంచి, యుద్ధరంగంలో సాధించిన ప్రయోజనాలను అనంతరం దౌత్యం ద్వారా సుస్థిరం చేసుకోవాలన్నది తమ వ్యూహమని వివరించారు. "యుద్ధరంగంలో గణనీయమైన విజయం" సాధించి, శత్రువు బలహీనపడిన తర్వాత, ఆ ప్రయోజనాలను "దౌత్య మార్గాల" ద్వారా పదిలం చేసుకోవాలని ఆయన జోడించారు. ఇరాన్‌ విధించిన షరతులు నెరవేరే వరకు వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవబోమని ఘలిబాఫ్‌ తేల్చిచెప్పారు. ఇరాన్‌ ప్రజల చట్టబద్ధమైన హక్కులను గుర్తించడం, అమెరికా గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం ఇందులో ప్రధానంగా ఉన్నాయని తెలిపారు. మధ్యవర్తుల ద్వారా తమ షరతులను అమెరికాకు స్పష్టంగా తెలియజేశామని చెప్పారు. మోసం, ఏకపక్ష ఆధిపత్యం చెలాయించే మార్గాలు మూసుకుపోయాయని శత్రువుకు బాగా తెలుసని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్