mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోజు రోజుకి పేదలపై భారం మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

09 జూన్, 2026

tirupati.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 09, 2026, 03:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చంద్రగిరి : రోజురోజుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపుతున్నాయని సిపిఐ మండిపడింది.  పెరిగిన  పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ పైన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ శ్రీరాములు అధ్యక్షతన మంగళవారం చంద్రగిరి పట్టణం క్లాక్ టవర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.  ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎన్ శ్రీరాములు, కే వై రాజా మాట్లాడుతూ..  ఒక్క మే నెలలోనే  కేంద్ర ప్రభుత్వం ఒకేసారి నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యవసర వస్తువులు పైన ఆరు రూపాయలు పెంచిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకి పేదలపై భారం మోపడం సిగ్గు చేటు అని అన్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరిచిపోయి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రధాని మోడీకి  వత్తాసు పలుకుతోందని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టులపై కూటమి  ప్రభుత్వం నిందలు వేయడం మానుకోవాలని, లేకుంటే  ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.  ఇప్పటికైనా ప్రజలపై  భారం మోపకుండా పెంచిన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సమీకరించి ధర్నా చేపడతామన్నారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అన్నారు.  చిన్న చిన్న వ్యాపారస్తులు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, రోజువారి కూలీ పని చేసేవారు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ అధిక ధరల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి కే వై రాజా, స్కూల్ స్లీపర్ యూనియన్ జిల్లా కార్యదర్శి వీ లాజర్, పి రాము, లక్ష్మీపతి,ప్రవీణ్, ప్రసాద్,చాన్ బాషా, చిరంజీవి, మహేష్, సుబ్రహ్మణ్యం, నాగూర్ భాష, బాలకృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్