గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ కేసులు : సిఐ నగేష్ బాబు

6 రోజుల క్రితం

Criminal cases will be filed if there is any obstruction to the nomination process CI Nagesh Babu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 11:26 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్,వార్డు సభ్యుల పదవికి పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సిఐ నగేష్ బాబు హెచ్చరించారు. సిఐ మాట్లాడుతూ ... అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియకు ఎవరైనా ఆటంకం కలిగించినా బెదిరించినా అడ్డుకున్నా వారిపై చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లా ఎస్పీ,జమ్మలమడుగు డిఎస్పి సూచనల మేరకు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. నామినేషన్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జనాలు గుమిగూడడం అభ్యర్థులు వారి మద్దతుదారులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నామినేషన్ కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేసుకునేందుకు పటిష్టమైన భద్రత కల్పిస్తామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని నగేష్ బాబు కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్