సుండుపల్లి (కడప) : సుండుపల్లి మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 2191/2 లో ఉన్న 80 చదరపు గజాల తన ఇంటి జాగా ను శ్రీరామ్ ఫైనాన్స్ వారు తాకట్టు పెట్టుకుని మరొకరికి లోన్ ఇచ్చారని వారిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని సుండుపల్లి కు చెందిన షేక్ షహనాజ్ అనే మహిళ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు మంగళవారం ఆమె ప్రజాశక్తికి తెలియజేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం .. మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 2191/2 లోని 80 చదరపు గజాల ఇంటి స్థలాన్ని షేక్ షహనాజ్ అనే మహిళ 2021 లో గరివి నాగిరెడ్డి అనే వ్యక్తి నుండి కొనుగోలు చేసింది. గరివి నాగిరెడ్డి 2018లో షేక్ నౌజియా బేగం వద్ద ఆ స్థలాన్ని కొన్నాడు. ఆ తరువాత షేక్ షహనాజ్ 2021లో ఆ స్థలాన్ని నాగిరెడ్డి నుండి కొనుగోలు చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. షేక్ నౌజియా బేగం కు 80 చదరపు గజాలలో మాత్రమే ఇల్లు ఉందని తెలిసి కూడా ఆమెకు 160 చదరపు గజాలు ఇల్లు ఉన్నట్లుగా శ్రీరామ్ ఫైనాన్స్ వారు తప్పుడు రికార్డులను సృష్టించి 2019 లో షేక్ నౌజియా బేగం కు 15 లక్షల లోన్ మంజూరు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నౌజియా బేగం లోన్ కంతులు సరిగా చెల్లించకపోవడం వలన శ్రీరామ్ ఫైనాన్స్ వారికి వడ్డీ మొదలు రూ.43 లక్షలు నౌజియా బేగం బాకీ పడినట్లు శ్రీరామ్ ఫైనాన్స్ వారు నోటీసులు పంపారని తెలిపారు. సదరు మొత్తాన్ని నౌజియా బేగం కట్టలేని పరిస్థితిలో ఉండటం వలన 06.11.2026 తేదీన ఆన్లైన్లో నౌ జియా బేగం ఇంటితోపాటు తన స్థలాన్ని కూడా వేలం వేస్తున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ వారు పబ్లిక్ నోటీస్ ఇచ్చారని దీనివలన లోనుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా తన ఆస్తి శ్రీ రామ్ ఫైనాన్స్ వారు అక్రమంగా వేలం వేయడానికి సిద్ధపడ్డారని ఆమె ఆరోపించారు. శ్రీరామ్ ఫైనాన్స్ వారు తన ఆస్తికి సంబంధించి అక్రమ రికార్డులు తయారు చేసుకుని, తనకు అన్యాయం చేసే పరిస్థితి తెచ్చారని, దీనికి కారణమైన శ్రీరామ్ ఫైనాన్స్ వారిపై ఫోర్జరీ చీటింగ్ కుట్ర కేసులు నమోదు చేయాలని బాధితురాలైన షేక్ షహనాజ్ సోమవారం సుండుపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీ రామ్ ఫైనాన్స్ వారిపై చీటింగ్ కేసు పెట్టండి : పోలీసులకు మహిళ ఫిర్యాదు
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026, 01:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)