గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనర్‌ మృతి

2 రోజుల క్రితం

Lorry cleaner dies in road accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 01:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-బ్రహ్మంగారి మఠం (కడప) : రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి చెందిన ఘటన మంగళవారం కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో జరిగింది. జుజురు గ్రామానికి చెందిన రామిశెట్టి నాగరాజు (34) క్లీనర్ కూలీగా పనిచేస్తున్నాడు. ఈర్లపాడు మండలం, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వాసి బొగ్గుల లారీ కి క్లీనర్ గా వెళ్ళేవాడు. బొగ్గుల లోడు లారీతో వెళుతుండగా, నందిపల్లె వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బొగ్గుల లారీ క్లీనర్ అక్కడికక్కడ మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్