mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘వారణాసి’ కొత్త షెడ్యూల్‌ మొదలు

12 మే, 2026

VARANASI to the WORLD - Mahesh Babu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 12, 2026, 09:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ కొత్త షెడ్యూల్ మంగళవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్లలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక సినిమా యూనిట్ విదేశీ లొకేషన్లకు వెళ్లనుంది. కెన్యా, యూరప్‌తో పాటు మరికొన్ని అరుదైన ప్రదేశాల్లో చిత్రీకరణ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల మెక్సికోలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ ఈవెంట్‌లో ‘వారణాసి’ని పరిచయం చేసిన చిత్రబృందం.. త్వరలో ఫ్రాన్స్‌లో కూడా భారీ ప్రమోషన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ కథ వారణాసి నుంచి మొదలై కెన్యా, అంటార్కిటికా వరకు విస్తరించనుందట. ముఖ్యంగా రామాయణ యుద్ధం నేపథ్యంతో రూపొందిస్తున్న 25 నిమిషాల భారీ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్