జెరూసలెం : గత కొన్ని నెలులుగా జరుగుతున్న యుద్ధం నేటి(జూన్ 19)తో ముగియనుంది. యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా- ఇరాన్‌లు నేడు స్విట్జర్లాండ్‌లో శాంతి ఒప్పందంపై సంతకం చేయనున్నాయి. ఈ ఒప్పందంలో ఇజ్రాయిల్ లెబనాన్‌పై దాడులు ఆపాలని కూడా ఇరాన్ ప్రతిపాదించింది. దానికి అమెరికా కూడా ఒప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంతో కీలకమైన ఈ శాంతి ఒప్పందం కుదిరే తరుణంలో ఇజ్రాయిల్ పక్కా ప్రణాళికతో లెబనాన్‌పై దాడులకు తెగబడింది. గురువారం అర్థర్రాతి దక్షిణ లెబనాన్‌పై వైమానిక దాడి, ఫిరంగులతో దాడులకు పాల్పడినట్లు శుక్రవారం ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది. ఈ దాడుల్లో 16 మంది మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు అని లెబనాన్ జాతీయ వార్తా సంస్త (ఎన్‌ఎన్‌ఎ) పేర్కొంది.








కామెంట్‌లు (0)