బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు చెందిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ కలిసి ఒక భారీ మలయాళ చిత్రాన్ని ప్రకటించాయి. 19వ శతాబ్దపు కేరళ జానపద కథలు, సాంస్కృతిక గాథల ఆధారంగా ‘ఓడియన్: ది ఏజ్ ఆఫ్ ఇల్యూజన్’ పేరుతో రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి కరణ్ జోహీర్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తాము ధర్మ ప్రొడక్షన్స్ తరపున మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌తో తమకు ఇప్పటికే ఎన్నో విజయవంతమైన కొల్లాబరేషన్స్ ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయబోతున్నామని చెప్పారు. బలమైన జానపద ఇతిహాసాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి నటి మంజు వారియర్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని, ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఆయన తెలిపారు.
Print Editionభారీస్థాయిలో మలయాళ జానపద చిత్రం!
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 16, 2026, 09:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)