తెలంగాణ : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసుకు సంబంధించి సినీనటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా హాజరయ్యారు. షూటింగ్ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం కోర్టుకు హాజరుకావాలని 19 మంది నిందితులకు ఇటీవల నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితులంతా న్యాయమూర్తి ఎదుట హాజరై బాండ్లపై సంతకాలు చేశారు. అనంతరం కేసు విచారణను న్యాయమూర్తి జులై 6కి వాయిదా వేశారు.
వర్చువల్‌గా కోర్టుకు హాజరైన అల్లు అర్జున్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 22, 2026, 04:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)