ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విద్యుత్ శాఖ ఉద్యోగులు రాష్ట్ర స్థాయి వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 23 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు హాజరు కావడం జరిగింది. పోటీలను విద్యుత్ శాఖ డైరెక్టర్ టి.వనజ, జిల్లా విద్యుత్ శాఖ సూపరెండెంట్ ఇంజినీర్ మువ్వల లక్ష్మణరావు లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .... నిత్యం ఉద్యోగ సేవలో ఉంటూ బిజిగా ఉండే ఉద్యోగులకు మానసిక, శారీరక ఉల్లాసం కలిగించేందుకు ఈ పోటీలు నిర్వహించడం మంచి పరిణామన్నారు. రాష్ట్ర పోటీలకు విజయనగరం అధికారులు నిర్వహణ బాధ్యతలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. క్రీడా స్పూర్తితో ఆడి జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పతకాలను తీసుకొని రావాలని ఆకాక్షించారు. అనంతరం వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి హరి, ఏ డి ఈ కిరణకుమార్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరావు, 23 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.
ఘనంగా విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 22, 2026, 04:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)