mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు : సిఎం చంద్రబాబు

2 గంటల క్రితం

cm chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 04:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని సిఎం చంద్రబాబు ఆరోపించారు. సోమవారం ఆర్టీజీఎస్‌పై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ... రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయని, ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. వివిధ ఘటనలకు కులమతాల రంగు పులుముతున్నారని, వాటిని వివాదాస్పద అంశాలుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్‌ ప్రచారం చేస్తూ ఉద్యోగులు, అధికారులను బద్నాం చేస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సిఎం సూచించారు. మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీలను పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కాలంలో మానసిక సమస్యల కారణంగా కూడా కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు అన్నారు. డ్రగ్స్, గంజాయిలకు అలవాటు పడి తప్పు దారి పడుతున్నారని వ్యాఖ్యానించారు. 2019 లో జరిగిన కొన్ని నేరాలను ఇప్పుడు ట్రేస్ చేసి పట్టుకుంటున్నారని, శిక్షలు కూడా పడుతున్నాయని చెప్పారు. ఇలాంటివి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. తప్పుచేసినవాడు ఎప్పుడూ తప్పించుకోలేడని హెచ్చరించారు. డిసెంబర్ నెలలో క్వాంటం కంప్యూటర్ లాంచ్‌ చేసేలోపు క్వాంటం పార్కు, సెమీ కండక్టర్ల పార్కు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య పరిష్కారం కోసం అధికారులు, ఉద్యోగుల వద్దకు వచ్చే పౌరులతో సౌమ్యంగా వ్యవహరించాలని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్