యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్పై యూనివర్స్ సిరీస్ నుండి వస్తున్న సరికొత్త చిత్రం “ఆల్ఫా” అధికారిక టీజర్ ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. పఠాన్, వార్, టైగర్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల సరసన YRF స్పై యూనివర్స్ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధాన (ఫీమేల్ లీడ్) చిత్రంగా వస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆలియా భట్, శర్వరీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘ది రైల్వే మెన్’ సిరీస్ ఫేమ్ శివ రావల్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో ‘సీత’ అనే పాత్రను పోషిస్తున్న ఆలియా భట్, ఎప్పుడూ కనిపించే సాఫ్ట్ రోల్స్‌కు భిన్నంగా మునుపెన్నడూ చూడని విధంగా లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఇందులో ఆలియాకు తండ్రిగా, మెంటార్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె 18వ పుట్టినరోజు వేడుకలో ఒక మిషన్‌ను అప్పగిస్తూ, “నువ్వు ఇకపై కేవలం ఒక అమ్మాయివి కాదు.. ఆల్ఫావి” అని ఆయన చెప్పే డైలాగ్ ఈ టీజర్‌కే ప్రధాన హైలైట్‌గా నిలిచింది.









కామెంట్‌లు (0)