mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘వెంకీ అనిల్ 5’ ప్రారంభం

8 గంటల క్రితం

anil
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 12:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం ‘వెంకీ అనిల్ 5’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. హీరోలు వెంకటేష్, కళ్యాణ్‌రామ్, కథానాయికలు కృతి శెట్టి, కీర్తి సురేష్, నిర్మాతలు సాహు గారపాటి దంపతులు, సురేష్‌బాబు, రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ నెల 22న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, 2027 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాఘవేంద్రరావు, దిల్‌రాజు, అల్లు అరవింద్, జి.వి. ప్రకాష్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్