ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ లవ్‌స్టోరీ చిత్రం ‘ఫౌజి’. దేశ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ సోల్జర్ పాత్రలో కనిపించనున్నారు. ఇమాన్వి ఇస్మాయిల్ కథానాయికగా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించినప్పటికీ, చిత్రీకరణ ఆలస్యం కారణంగా డిసెంబరు తొలి వారంలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 15న టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రీకరణలో బిజీగా ఉండగా, త్వరలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని ‘కల్కి 2’ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ‘స్పిరిట్’ చిత్రం 2027 మార్చి 5న విడుదల కానుంది. ‘కల్కి 2’ విడుదల తేదీపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఆగస్టు 15న ఫౌజి టీజర్
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 16, 2026, 09:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)