mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం

1 గంట క్రితం

war
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 10:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆదివారం తెల్లవారు జామున కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. హర్మూజ్ జలసంధి సమీపంలోని తమ కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులకు సమాధానంగానే ఈ సైనిక చర్య చేపట్టినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ ఆకస్మిక దాడితో ఆ ప్రాంతంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయి.. ఇరుదేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులను కువైట్ రక్షణ వ్యవస్థలు అడ్డుకోగా, బహ్రెయిన్‌లోని యూఎస్ స్థావరాల వద్ద భారీ నష్టం జరిగినట్లు సమాచారం.. రాబోయే రోజుల్లో అమెరికా సైనిక స్థావరాలు ‘నరకాన్ని చూస్తాయని’ ఇరాన్ నావికాదళం తీవ్ర హెచ్చరికలు జారీ చేయగా, దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఘాటుగా స్పందించారు. ఇరాన్ గనుక ఇలాగే ఒప్పందాలను ఉల్లంఘిస్తూ పోతే సైనిక పరంగా ఈ కథను ముగించాల్సి వస్తుందని, అటువంటి పరిస్థితి వస్తే ప్రపంచ పటంలో ‘ఇరాన్ అనే దేశమే ఇకపై ఉనికిలో ఉండదు’ అంటూ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్