mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆటోను ఢీకొన్న లారీ.. ముగ్గురు మహిళల దుర్మరణం

1 గంట క్రితం

srikakulam acident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 11:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి –కవిటి: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జమేదారిపుట్టుగ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కంచిలి ఆదివారం సంత నుంచి పనసకాయల లోడ్‌తో బరంపురం వెళ్తున్న ఆటోను, మద్యం మత్తులో ఉన్న ఒక లారీ డ్రైవర్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ దుర్ఘటనలో ఎస్‌పేటకు చెందిన మద్దిలి తరిణమ్మ (52), గుజ్జిపుట్టుగకు చెందిన మురపాల పార్వతి (50), రాపాకపుట్టుగకు చెందిన నర్తు పద్మమ్మ (60) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌తో పాటు మరో నలుగురిని చికిత్స నిమిత్తం ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్