mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలియో రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

1 గంట క్రితం

mla kalva
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 11:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రాయదుర్గం: చిన్నారుల సంపూర్ణ ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని 13వ వార్డు డిపియిపి పాఠశాలలో చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజ భవిష్యత్తు చిన్నారుల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని, పోలియో నిర్మూలన విజయాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 5 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించడం తప్పనిసరని, తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు లేకుండా పిల్లలను పోలియో కేంద్రాలకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాలను వికలాంగత నుంచి రక్షించే ఈ సామాజిక బాధ్యతలో అధికారులు, వైద్య, అంగన్‌వాడీ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, స్థానిక టిడిపి నాయకులు నాగరాజు నాయక్, టoకశాల హనుమంతు, అశోక్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్