mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెనిజులాలో భూకంప విలయం: 1,430కి చేరిన మృతుల సంఖ్య

1 గంట క్రితం

earth quake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 10:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వెనిజులాను అతలాకుతలం చేసిన జంట భూకంపాల ధాటికి మరణించిన వారి సంఖ్య 1,430కు చేరుకుంది. ఈ ఘోర విపత్తు కారణంగా 3,238 మంది తీవ్రంగా గాయపడగా, మరో 3,142 మంది నిలువ నీడ లేక నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న పలువురి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో సహాయక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, ఆహార కొరత ఏర్పడటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంక్షోభ పరిస్థితుల నుండి దేశాన్ని గట్టెక్కించేందుకు స్థానిక సైన్యంతో పాటు మిత్రదేశాల నుంచి రంగంలోకి దిగిన 1,600 మంది ప్రత్యేక సిబ్బంది యుద్ధప్రాతిపదికన పునరావాస, సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్