mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాడార్ నుంచి అదృశ్యమైన రష్యన్ విమానం.. సురక్షితం!

1 రోజు క్రితం

Boeing 737-800 passenger plane
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 18, 2026, 08:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రష్యాలో బుధవారం సాయంత్రం ఒక ప్రయాణికుల విమానం గాల్లోనే అదృశ్యమవడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. స్మార్టావియా సంస్థకు చెందిన బోయింగ్ 734-800 విమానం రష్యాలోని సోచి నగరం నుంచి అర్ఖంగెల్స్క్‌కు బయలుదేరింది. అయితే, నల్లసముద్రం (బ్లాక్ సీ) మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో ఒక్కసారిగా తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది.

దీంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే అంతర్జాతీయ అత్యవసర సంకేతమైన 'డిస్ట్రెస్ సిగ్నల్' (7700 కోడ్) పంపారు. ఆ వెంటనే విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోవడంతో అది సముద్రంలో కూలిపోయి ఉంటుందని భావించి రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలకు సిద్ధమయ్యాయి. అయితే, రాడార్ పరిధి నుంచి మాయమైన కొద్దిసేపటికే విమానం మళ్లీ సిగ్నల్‌లోకి వచ్చింది. గాల్లోనే ఇంధనాన్ని తగ్గించుకుంటూ.. విమానాన్ని పైలట్లు అత్యంత చాకచక్యంగా తిరిగి సోచి విమానాశ్రయానికే మళ్లించి, అక్కడ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అధికారులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. వీరందరినీ ప్రత్యామ్నాయ విమానాల్లో వారి గమ్యస్థానాలకు తరలించనున్నట్లు రష్యన్ మీడియా పేర్కొంది. రాడార్ సిగ్నల్స్ పూర్తిగా కట్ అయిన విమానం ఇలా తిరిగి సురక్షితంగా ల్యాండ్ అవ్వడం అత్యంత అరుదని విమానయాన నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్