మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహిళా స్వేచ్ఛకు సంకెళ్లు.. గాయనికి 74 కొరడా దెబ్బలు ..!

36 నిమిషాల క్రితం

Shackles on womens freedom 74 lashes for a female singer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 12:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • హిజాబ్ లేకుండా పాట.. ఇరాన్ గాయనికి, ఆమె బృందానికి కఠిన శిక్ష‍


ఇరాన్‌ : ఇరాన్‌లో మహిళలపై ఆంక్షలు, అణచివేత మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. హిజాబ్ ధరించకుండా సంగీత ప్రదర్శన ఇచ్చినందుకు ప్రముఖ గాయని పరస్తూ అహ్మదీకి 74 కొరడా దెబ్బల శిక్షను అధికారులు అమలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.


2024 డిసెంబర్‌లో ఖోమ్ నగరంలో పరస్తూ అహ్మదీ నలుగురు సంగీతకారులతో కలిసి ఓ సంగీత ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె హిజాబ్ ధరించకుండా పాటలు పాడారు. ప్రేక్షకులు లేకుండానే నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వీడియోగా చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోకు మిలియన్ల సంఖ్యలో వీక్షణలు వచ్చాయి. దీంతో ఇరాన్ అధికారులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు.


ఈ కేసును విచారించిన ఇరాన్ న్యాయస్థానం పరస్తూ అహ్మదీతో పాటు ఆమె బృందంలోని సభ్యులకు ఒక్కొక్కరికి 74 కొరడా దెబ్బల శిక్ష విధించింది. రెండేళ్లపాటు విదేశీ ప్రయాణాలు చేయకుండా, కళా, సంగీత కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. తాజాగా నవంబర్ 23న గాయనితో పాటు బృందంలోని నలుగురికి ఈ శిక్షను అమలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.


కాగా, 2022లో మహ్సా అమినీ అనే యువతి హిజాబ్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో పోలీసుల అదుపులోకి వెళ్లి కస్టడీలో మరణించారు. ఈ ఘటన ఇరాన్‌లో తీవ్ర నిరసనలకు దారితీసింది. మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం పెద్దఎత్తున ఉద్యమాలు జరిగాయి. తాజాగా గాయనికి విధించిన శిక్ష మరోసారి ఇరాన్‌లో మహిళల వస్త్రధారణపై ఆంక్షలు, భావప్రకటనా స్వేచ్ఛకు ఎదురవుతున్న అడ్డంకులపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరలేపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్