పారిస్‌లో అధ్యక్షుల సంతకాలు
పారిస్ : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ ఇరుదేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో ఇరుదేశాల అధ్యక్షులు ఈ శాంతి ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. ఈ అరుదైన ఒప్పందం విజయవంతంగా ముగిసిందని, రెండు దేశాలు సంతకాలు చేశాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.
ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి మొత్తం 14 కీలక అంశాలతో కూడిన నివేదికను అమెరికా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. కాగా ఈ ఒప్పందంలో భాగంగా లెబనాన్ దేశాన్ని కూడా ఇరుపక్షాలు భాగస్వామిని చేశాయి. లెబనాన్‌తో పాటు అన్ని సరిహద్దు వైపులా ఎలాంటి సైనిక చర్యలు చేపట్టకూడదని, తక్షణమే వాటిని నిలిపివేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన 'హర్మూజ్ జలసంధి' దిగ్బంధాన్ని రాబోయే 30 రోజుల్లోగా పూర్తిగా ఎత్తివేయడానికి ఇరాన్ అంగీకరించింది. ఈ అంతర్జాతీయ ఒప్పందంతో పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.









కామెంట్‌లు (0)